షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు

జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు..

టాలీవుడ్ (Tollywood) యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ (Jr. NTR) షూటింగ్‌ (Shooting)లో గాయపడ్డారు (Injured). యాడ్ షూటింగ్‌ (Ad Shooting)లో పాల్గొంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో వెంటనే ప్రాథమిక చికిత్స అందించగా, ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని టీమ్ తెలిపింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వార్త తారక్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తమ అభిమాన నటుడు త్వరగా కోరుకోవాలని జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే పలువురు సెలబ్రిటీలు ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment