ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది భక్తులు దుర్మ‌ర‌ణం

ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది భక్తులు దుర్మ‌ర‌ణం

ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్రం దెవఘఢ్ జిల్లా (Deoghar District)లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం 18 మంది భ‌క్తుల ప్రాణాల‌ను బ‌లిగొంది. కన్వర్ (Kanwar) యాత్రకు వెళ్తున్న భక్తులతో వెళ్తున్న బస్సు (Bus), ఎదురుగా వస్తున్న ట్రక్కు (Truck)తో ఢీకొన్న ప్రమాదం (Accident)లో బ‌స్సులోని భ‌క్తులు 18 మంది అక్కడికక్కడే మృతిచెందగా (Died),ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లుగా స‌మాచారం.

శ్రావణ మాసం సందర్భంగా ఉత్తర భారతదేశం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కాశీ, గంగా నదుల వద్ద తులాభారం నింపేందుకు యాత్రలు చేస్తుంటారు. శ్రావ‌ణ‌మాస యాత్ర ప్రారంభంలోనే రోడ్డు ప్ర‌మాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోవ‌డంతో భ‌క్తులు ఆందోళ‌న చెందుతున్నారు. భక్తుల బస్సును ట్రక్కు ఢీకొట్టిన‌ దృశ్యాలు స్థానికులను కలచివేశాయి.

ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. కొందరికి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. బాధితులకు అత్యవసర వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా యంత్రాంగం తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment