టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు టీమిండియా కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరల్ జ్వరం కారణంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. నిన్న గ్రౌండ్‌కు వచ్చినప్పటికీ ఆయన ప్రాక్టీస్‌కు దూరంగా ఉండటంతో, మ్యాచ్ ఆడే అవకాశాలు మరింత తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. కీలక టోర్నీలో ఆరంభ మ్యాచ్ కావడంతో బుమ్రా ఫిట్‌నెస్‌పై మేనేజ్మెంట్ ఎలాంటి రిస్క్ తీసుకోవద్దనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇంకా పూర్తిగా ఫిట్ కాకపోవడంతో భారత స్క్వాడ్‌లో ప్రస్తుతం 13 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అమెరికాతో మ్యాచ్‌లో భారత జట్టు ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బుమ్రా లేకపోయినా బౌలింగ్ విభాగం ఎలా రాణిస్తుందోనన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.








ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్