టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బూమ్రా

టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బూమ్రా

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా 2024 సంవత్సరానికిగాను ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. బూమ్రా తన బౌలింగ్‌తో టెస్టు మ్యాచ్‌లలో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చాడు. 2024 సంవ‌త్స‌రంలో 13 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసి భారత టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ జాబితాలో బూమ్రా త‌రువాతి స్థానంలో అట్కిన్సన్ (52), షోయబ్‌ బషీర్‌ (49), మ్యాట్‌ హెన్రీ (48), రవీంద్ర జడేజా (48) ఉన్నారు.

ఐసీసీ టీ20 క్రికెటర్ అర్షదీప్ సింగ్
భారత యువ పేసర్ అర్షదీప్ సింగ్ 2024లో తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రతిష్టాత్మక ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. 2024 సంవత్సరంలో 18 టీ20 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు పడగొట్టిన అర్షదీప్, వరల్డ్‌కప్‌లోనే 17 వికెట్లు తీసి భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఐసీసీ ఉమెన్స్‌ వన్డే క్రికెటర్‌ స్మృతి
ఐసీసీ ఉమెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ 2024 అవార్డు గెలుచుకుంది. గతేడాది వన్డేల్లో ఆక‌ట్టుకున్న స్మృతి మంధనకు ఈ అవార్డు ద‌క్కింది. గతేడాది మొత్తం 13 వన్డేలు ఆడిన మంధన, నాలుగు సెంచరీల సాయంతో 57.86 సగటున, 95.15 స్ట్రయిక్‌రేట్‌తో 747 పరుగులు చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment