నటి జాన్వీ కపూర్ ఇంట విషాదం

నటి జాన్వీ కపూర్ ఇంట విషాదం

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ , బోనీ క‌పూర్ల‌ తల్లి (Mother), నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నానమ్మ (Grandmother) అయిన నిర్మల్ కపూర్ (Nirmal Kapoor) (90) మృతి చెందారు (Passed Away). వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో (Kokilaben Dhirubhai Ambani Hospital) చికిత్స పొందుతూ శుక్ర‌వారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

నిర్మల్ కపూర్‌కు నిర్మాత బోనీ కపూర్, నటులు అనిల్ కపూర్, సంజయ్ కపూర్, అలాగే రీనా కపూర్ పిల్లలుగా ఉన్నారు. ఆమె మృతితో కపూర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, బాలీవుడ్ సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. అభిమానులు కూడా కపూర్ కుటుంబానికి ఓదార్పు పలుకుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment