జనసేన ఎమ్మెల్యే (Jana Sena Party MLA) అరవ శ్రీధర్ (Arava Sridhar) రాసలీలల (Obscene) వీడియో రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మహిళా ఉద్యోగితో న్యూడ్ (Nude)గా ఫోన్ కాల్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ తీవ్రంగా స్పందించింది. ప్రజలకు సేవ చేయాల్సిన ఎమ్మెల్యేలు మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడింది. “ఇదేనా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చే శిక్షణ?” అంటూ జనసేనపై ఘాటు విమర్శలు గుప్పించింది.
ఒక మహిళా ఉద్యోగిని లైంగిక కోరిక తీర్చాలంటూ వేధించడం దుర్మార్గమని వైసీపీ(YSRCP) పేర్కొంది. వేదికలపై మహిళల రక్షణ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు… క్షేత్రస్థాయిలో మాత్రం మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించింది. సొంత ఎమ్మెల్యేలనే అదుపులో పెట్టుకోలేని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాష్ట్రాన్ని, మహిళలను ఎలా రక్షిస్తారని ప్రశ్నించింది.
వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు
ఈ అంశంపై వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల చేత మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళల జీవితాలతో ఆటలాడుతున్నారు. తప్పు చేస్తే శిక్ష తప్పదన్న భయం పూర్తిగా పోయింది” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవ శ్రీధర్ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశాడని, అతనిపై ఇప్పటికీ ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తప్పుడు పనులు చేసే వారికే ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వంపై వరుస ఆరోపణలు
రాప్తాడులో టీడీపీ కార్యకర్తల లైంగిక దాడి కేసు, జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం, కోట వినూతపై స్పైయింగ్ కేసు, తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస రావు కారణంగా మహిళా వీఆర్వో ఆత్మహత్యాయత్నం వంటి ఘటనల్లో కూడా ఎలాంటి చర్యలు లేవని వరుదు కళ్యాణి గుర్తు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళకు పలుమార్లు అబార్షన్లు చేయించి, లొంగకపోతే ఆమె కుమారుడిని చంపుతానని బెదిరించినా ప్రభుత్వం మౌనంగా ఉందని మండిపడ్డారు.
మీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయండి
“మహిళపై చేయి వేస్తే అదే చివరి రోజు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు? మహిళా హోంమంత్రి అనితకు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు కనిపించట్లేదా?” అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ సుమోటోగా కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని నిలదీశారు. “వీడియోలు బయటకు రానీయవద్దని చెప్పే ఏకైక పార్టీ జనసేన. తప్పులు చేయొద్దని చెప్పకుండా ఆధారాలు బయటకు రాకుండా చూడటం దారుణం” అంటూ విమర్శించారు.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
“జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచకపర్వం వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయి. మహిళను లోబరుచుకుని అత్యాచారం చేయడం, అబార్షన్లు చేయించడం, దాడులు చేయడం అత్యంత హేయమైన చర్యలు” అని వరుదు కళ్యాణి అన్నారు. అరవ శ్రీధర్‌పై సుమోటోగా కేసు నమోదు చేసి, జనసేన నుంచి సస్పెండ్ చేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి డిస్‌క్వాలిఫై చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది.
Janasena ❌ | Kamasena ✅
— YSR Congress Party (@YSRCParty) January 27, 2026
రైల్వే కోడూరు @JanaSenaParty ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్, అరవ శ్రీధర్ కీచకపర్వం…🚨
-ఫేస్బుక్ పరిచయాన్ని ఆసరా చేసుకుని మహిళా ఉద్యోగిణిపై వేధింపుల పర్వం
-ప్రభుత్వ ఉద్యోగిణిని భయపెట్టి ఏడాదిన్నరగా అత్యాచారం చేసిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
-తల్లిదండ్రులు… pic.twitter.com/YBfk5w9lnA








