జాకెట్ చించి, తాళి తెంచి.. మ‌హిళ‌పై జనసేన నేత దాష్టీకం

జాకెట్ చించి, తాళి తెంచి.. మ‌హిళ‌పై జనసేన నేత దాష్టీకం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh)లో మ‌హిళ‌ల‌పై (Women) జ‌రుగుతున్న వ‌రుస దాడులు, ఆకృత్యాలు భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తున్నాయి. ఉద్యోగం(Job) ఇప్పిస్తాం ప‌క్క‌లోకి రా అని అధికార టీడీపీకి చెందిన నేత‌లు మ‌హిళ‌లు వేధిస్తున్న (Harassing) వీడియోలు ఏపీలో క‌ల‌క‌లం సృష్టిస్తుండ‌గా, తాజాగా అధికారంలో పాలుపంచుకున్న మ‌రో పార్టీ జ‌న‌సేన‌ (Jana Sena)కు చెందిన నాయ‌కుడు మ‌హిళ‌ల‌ను ఏకంగా పొలంలో ప‌డేసి రాళ్లు, క‌ర్ర‌ల‌తో అత్యంత పాశ‌వికంగా దాడి చేసిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లా ఏఎస్ పేట (AS Peta) మండలం పెద్ద అబ్బీపురం (Pedda Abbeepuram)లో జనసేన పార్టీకి చెందిన ఊస వెంకట్రావు (Oosa Venkatravu) అనే నాయకుడు మహిళపై దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.

బాధితురాలి వివ‌రాల ప్ర‌కారం.. అనసూయమ్మ (Anasuyamma) అనే మహిళ తన పొలం పక్కన జ‌నసేన నేత ఊస వెంకట్రావు భూమి కొనుగోలు చేశాడు. అన‌సూయ‌మ్మ భూమి నుంచి త‌న భూమికి దారి వేసేందుకు ప్రయత్నించాడు. దాన్ని అన‌సూయ‌మ్మ అడ్డుకుంది. దీంతో కోపంతో వెంకట్రావు ఆమెపై దాష్టీకానికి పాల్పడ్డాడు. జాకెట్‌ (Jacket)లో చెయ్యిపెట్టి చించేసి ఆమెను కిందకు తోసి పడేసిన వెంకట్రావు, తాళి తెంపేసి, బూతులు తిట్టుతూ కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశాడు.

ఈ దాడిలో అనసూయమ్మ తలపై గాయాలు కాగా, ఆమె కుమారుడినీ తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. సంఘటన అనంతరం అనసూయమ్మ కన్నీరుమున్నీరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి న్యాయం కోరింది. తన తాళిని కూడా తెంపేసి భయభ్రాంతులకు గురిచేశారంటూ భాదితురాలు వాపోయారు. ఆమె, జనసేన నేత వెంకట్రావు దౌర్జన్యానికి నలిశెట్టి శ్రీధర్ వంటి నియోజకవర్గ ఇంచార్జ్‌లు అండగా ఉన్నారని ఆరోపించింది. బాధితురాలు పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి నీచులను పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు అంటూ ద‌మ్మెత్తిపోశారు. ప్రస్తుతం వెంకట్రావు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ స్థానికులు ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment