రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన ఏలూరు జిల్లా రేవ్ పార్టీ ఘటనలో జనసేన పార్టీకి చెందిన నేతను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. జనసేన నేత వాకమూడి ఇంద్ర తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా రైస్ మిల్లులో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో 50 మంది యువతులు, ఇతర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేయించిన వీడియో ఒకటి తెగ వైరల్ అయ్యింది. దీనిపై కూపీ లాగగా ఈ పనిచేసింది జనసేన నేత ఇంద్రకుమార్ అని తేలింది.
పోలీసుల చర్యలు.. 17 మంది అరెస్టు
ఈ ఉదంతంపై వెంటనే స్పందించిన పోలీసులు, 17 మందిని అరెస్టు చేశారు. పార్టీలో విచ్చలవిడిగా మద్యం సరఫరా చేశారని, యువతులకు, హిజ్రాలకు మద్యం తాగించి అశ్లీల నృత్యాలు చేయించారని తెలిసింది. ఈ ఘటనపై జనసేన పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది.
దీంతో ఇంద్రకుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. అసాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారనే ఆరోపణల దృష్ట్యా ఇంద్రకుమార్‌ను జనసేన గ్రామ పార్టీ పదవి నుంచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నిడమర్రు మండల కన్వీనర్ నిమ్మల దొరబాబు తెలిపారు.







