---Advertisement---

మ‌రింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం.. మాట్లాడలేకపోయిన రైతుల నేత‌

మ‌రింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం.. మాట్లాడలేకపోయిన రైతుల నేత‌
---Advertisement---

పంజాబ్-హర్యానా బార్డర్‌లోని ఖనౌరీ సరిహద్దులో ఆమరణ దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. వైద్యులు, రైతు నాయకుల వివ‌రాల ప్ర‌కారం.. ఆదివారం ద‌ల్లేవాల్‌కు తల తిరగడం, వాంతులు రావడం, స్పష్టంగా మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడం కారణంగా కిసాన్ మహాపంచాయత్ వేదికపైకి వెళ్లమని సూచించాం, కానీ దల్లేవాల్ సభలో ప్రసంగించాలని పట్టుబట్టి సుమారు పదకొండు నిమిషాలు మాట్లాడారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన వాంతులు చేసుకున్నారు” అని దల్లేవాల్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ అవతార్ సింగ్ తెలిపారు.

డాక్టర్ అవతార్ సింగ్ చెప్పిన‌ట్లుగా దల్లేవాల్ ఆరోగ్యం మరింత క్షీణించింద‌ని, అతనికి కాలేయం, కిడ్నీలు మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయని మెడికల్ బులెటిన్‌లో పేర్కొన్నారు. గ‌తేడాది నవంబర్ 26 నుంచి ఆయన ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment