మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వీరంగం సృష్టించారు. సంగారెడ్డి జిల్లాలోని 34వ వార్డులో పోలింగ్ జరుగుతున్న వేళ రిగ్గింగ్ జరుగుతోందంటూ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న వాగ్వివాదం తీవ్ర స్థాయికి చేరింది.
ఈ ఘటనలో సీఐ శివకుమార్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిని గల్లా పట్టుకున్నారని ఆరోపిస్తూ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరేయ్.. ఇటు రా..రా.. లం***కా.. అంటూ సీఐ శివకుమార్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా మాటలతో రెచ్చిపోయారు. పదేళ్లు బీఆర్ఎస్ నాయకులు ఉచ్చ తాగిండు అంటూ సీఐని అసభ్యకర పదజాలంతో దూషించాడు. పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఆయన ప్రయత్నించడంతో అక్కడ తోపులాట జరిగింది. వెంటనే ఇతర పోలీసు అధికారులు జోక్యం చేసుకుని జగ్గారెడ్డిని సముదాయించారు.
పోలీసుల తీరుపై జగ్గారెడ్డి మండిపాటు
సీఐ శివకుమార్ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన చరిత్ర ఉందని జగ్గారెడ్డి ఆరోపించారు. “దమ్ముంటే సీఐ నా ముందుకు రావాలి” అంటూ సవాల్ విసిరారు. తాను గత 26 ఏళ్లుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లలేదని, “ఇది ఏమైనా సినిమా షూటింగ్ా..? మా అభ్యర్థిని గల్లా పట్టుకోవడం ఏమిటి?” అంటూ సీఐపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మునుపటి రోజు కూడా వివాదం
ఇదిలా ఉండగా, మున్సిపల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో జగ్గారెడ్డిపై మంగళవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కేసు నమోదైంది. సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని ఓ హోటల్ వద్ద పేదలు, వృద్ధులకు డబ్బులు పంచిన ఘటన వివాదాస్పదంగా మారడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ రోజు చోటుచేసుకున్న ఈ పరిణామాలు స్థానికంగా రాజకీయ వేడి మరింత పెంచాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యలు, పోలీసుల చర్యలపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ కొనసాగుతోంది.








