నటుడు జగపతి బాబును ప్రశ్నించిన ఈడీ

నటుడు జగపతి బాబును ప్రశ్నించిన ఈడీ

Summarize with AI


సినీ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) అనూహ్యంగా ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) విచారణకు హాజరయ్యారు. గతంలో ఎలాంటి కేసులు లేని ఆయన, సాహితి ఇన్‌ఫ్రా (Sahiti Infra) కేసు(Case)లో ఈడీ ఎదుట హాజరు కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈడీ అధికారులు జగపతి బాబును సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.జగపతి బాబు గతంలో సాహితి ఇన్‌ఫ్రా కంపెనీ ప్రకటనల్లో నటించారు. ఈ నేపథ్యంలో, ఆ సంస్థ నుంచి ఆయనకు డబ్బు ఎలా వచ్చింది, దాన్ని ఎలా ఉపయోగించారు వంటి విషయాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు.

సాహితి ఇన్‌ఫ్రా ఫ్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో సుమారు 700 మంది కస్టమర్ల నుంచి రూ. 800 కోట్లు వసూలు చేసి మోసం చేసిందని ఈడీ గుర్తించింది. ఈ డబ్బును పలు షెల్ కంపెనీలకు తరలించినట్లు తేలింది. ఈ సంస్థ రూ. 126 కోట్లతో 21 ఆస్తులను కొనుగోలు చేసినట్లు అధికారులు గతంలోనే ప్రకటించారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే రూ. 161 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment