రాప్తాడు (Raptadu) నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ (Ys Jagan) మంగళవారం పర్యటించనున్నారు. ఇటీవల దారుణంగా హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య (Kuruba Lingamayya) కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి (Papireddypalli) కి వెళ్లనున్నారు. కానీ, ఈ పర్యటనకు సంబంధించి పోలీసులు (Police) కఠిన ఆంక్షలు (Strict Restrictions) విధించడం గమనార్హం.
పోలీసులు హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతులు నిరాకరించడమే కాకుండా, చెన్నేకొత్తపల్లిలో హెలిప్యాడ్ (Helipad) కు ‘నో (No)’ చెప్పారు. బదులుగా కుంటిమద్ది-పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్‌కు అనుమతి ఇచ్చారు. అంతేకాక, వైసీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరవద్దని పోలీసుల హెచ్చరికలు వెలువడ్డాయి. ఇక, పార్టీ నేతలు, కార్యకర్తలను ముందే అడ్డుకునేందుకు ముందస్తు వ్యూహాలతో పోలీసులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి పర్యటనపై ఆంక్షలు ‘రెడ్‌బుక్ రాజ్యాంగం (‘Red Book Constitution’)’ అమలులో భాగమేనంటూ వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి .








