వైఎస్ జ‌గ‌న్ శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు

వైఎస్ జ‌గ‌న్ శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని ప్రజలందరికీ శ్రీరామ నవమి (Sri Rama Navami) శుభాకాంక్షలు (Greetings) తెలుపుతూ వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) హృదయపూర్వక సందేశం ఇచ్చారు. శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, శాంతి, శుభాకాంక్షలు (Good Wishes) కలగాలని ఆయన ఆకాంక్షించారు. ‘సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు. రామ‌చంద్రుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదు. అబద్ధం ఆడలేదు. ప్రజారంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆద‌ర్శ‌నీయం. ఆ జానకీ వల్లభుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు’ తెలుపుతూ జ‌గ‌న్ ట్వీట్ (Jagan Tweet) చేశారు.

శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఒంటిమిట్ట, భద్రాచలంలోని శ్రీ‌రామ ఆలయాలు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. రాములవారి కల్యాణ మహోత్సవం సంద‌ర్భంగా ఆల‌యాల‌ను సుంద‌రంగా ముస్తాబు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆధ్యాత్మిక శోభ ఉట్టిప‌డుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment