తన సొంత నియోజకవర్గంలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల తీరుపై మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief-Minister), వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రరాష్ట్రం (Andhra State)లో ప్రజాస్వామ్యం (Democracy) తునాతునకలవుతోందని మాజీ సీఎం మండిపడ్డారు. పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) జడ్పీటీసీ (ZPTC) ఉప ఎన్నికల్లో (By Elections) చోటుచేసుకున్న అక్రమాలపై ఎక్స్ వేదికగా చంద్రబాబు (Chandrababu)పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేవలం రెండు చిన్న ZPTC సీట్లు గెలుచుకోవడానికి చంద్రబాబు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను వాడుకొని రిగ్గింగ్ (Rigging)కు పాల్పడ్డారని, పోలింగ్ బూత్‌లను దూర ప్రాంతాలకు మార్చి ఓటర్లను అడ్డుకున్నారని వైఎస్ జగన్ తన ట్వీట్‌లో ధ్వజమెత్తారు. టీడీపీ(TDP) నాయకులు, కార్యకర్తలు బూత్‌లను ఆక్రమించి, ఏజెంట్లను బయటకు తోసివేసి, మహిళా ఏజెంట్లపై కూడా దాడులు చేశారని ఆరోపించారు.
“ఇది ఎన్నిక కాదు, ప్రజాస్వామ్యానికి (Democracy) బ్లాక్ డే (Black Day)” అని వ్యాఖ్యానించిన జగన్, ఉప ఎన్నికలను రద్దు చేసి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. అదే విధంగా చంద్రబాబు పాలనలో వ్యవసాయం నుంచి విద్య, వైద్యం, పారదర్శకత వరకు అన్ని రంగాలు దెబ్బతిన్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ మోసమైపోయాయని జగన్ ఎద్దేవా చేశారు. “ప్రజలు మనసులు గెలవకపోతే, ఇలాంటి అరాచకాలకే దిగజారతారు” అని వ్యాఖ్యానించారు.
పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యందిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న… pic.twitter.com/Qky1FZjeQA
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 12, 2025