సింహ‌పురికి మాజీ సీఎం.. ఆంక్ష‌లు ఆప‌గ‌ల‌వా..?

సింహ‌పురికి మాజీ సీఎం.. ఆంక్ష‌లు ఆప‌గ‌ల‌వా..?

నెల్లూరు (Nellore) జిల్లా (District)లో మాజీ (Former) ముఖ్య‌మంత్రి (Chief Minister) వైఎస్‌ జగన్ (YS Jagan) పర్యటన సందర్భంగా నెల్లూరు మొత్తం ఆంక్ష‌ల వల‌యంలో ఉంది. జగన్ పర్యటన ప్రజల్లో పెద్ద చర్చగా మారకూడదన్న ఉద్దేశంతో టీడీపీ(TDP) కుట్రలు చేస్తోందని వైసీపీ(YSRCP) నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 2 వేల‌కు పైగా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన‌ట్లుగా స‌మాచారం. సెక్షన్ 30 అమల్లో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల మైక్ ప్రకటనలు చేస్తున్నారు పోలీసులు. జిల్లాలోనే కాకుండా సమీప జిల్లాల వైసీపీ నేతలకు, కార్యకర్తలకు కూడా నోటీసులు అందుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌ (Anil Kumar Yadav), ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి (Chandrashekhar Reddy), మాజీ ఎమ్మెల్యేలు ప్రసన్న కుమార్ రెడ్డి (Prasanna Kumar Reddy), రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి (Ramireddy Prathapkumar Reddy)ల‌కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసి, జగన్ పర్యటనకు రాకూడదని హెచ్చరించారు.

జైలులో ఉన్న‌మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ (Kakani Govardhan)తో భేటీ అవ్వడం, టీడీపీ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం జగన్ పర్యటన ముఖ్య కారణాలు. సాధారణంగానే జగన్ వస్తే నాలు భారీగా త‌ర‌లివ‌స్తారు.. అందుకే ఆయన పర్యటనలపై పరిమితులు విధించి, ప్రజలను దూరం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

నోటీసులు ఆప‌గ‌ల‌వా..?
తాజాగా జగన్ నెల్లూరు పర్యటనలో 113 మందికి మించి హాజరుకావద్దని వింత ఆంక్షలు విధించారు. బైక్ ర్యాలీలు, రోడ్ షోలకు పూర్తిగా అనుమతి నిరాకరించారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కేవలం 100 మందికే అనుమతి ఉంటుందని హెచ్చరించారు. అంతకంటే ఎక్కువ మంది గుమిగూడితే కేసులు పెడతామని కార్యకర్తలకు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అంతేకాకుండా హెలిప్యాడ్ వద్దకు కేవలం 10 మందికే అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు తేల్చి చెప్పారు. గ‌తంలో స‌త్తెన‌ప‌ల్లి, బంగారుపాళెం ప‌ర్య‌ట‌న‌లోనూ పోలీసులు ఆంక్ష‌లు విధించారు. అయినా జ‌గ‌న్ అభిమానాన్ని ఆప‌లేక‌పోయారు. దారుల‌న్నీ బారికేడ్ల‌తో మూసేసినా, పొలాలు, కాల్వ గ‌ట్ల మీదుగా కొత్త దారులు సృష్టించుకొని వైసీపీ శ్రేణులు గ‌మ్యానికి చేరారు. మునుప‌టి ప‌ర్య‌ట‌న‌ల‌కంటే క‌ఠినమైన ఆంక్ష‌లు విధించిన నెల్లూరు పోలీసులు.. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు జ‌నాన్ని రాకుండా అడ్డుకోగ‌ల‌రా..? అనేది ప్ర‌శ్న‌గా మారింది.

వేలాదిగా త‌ర‌లివ‌స్తారు.. అనిల్ కుమార్ యాద‌వ్‌
వైఎస్‌ జగన్‌ పర్యటనలంటే కూటమికి భయమెందుకు? అని మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారు. కూటమి సర్కార్‌ ప్రజల సంక్షేమాన్ని వదిలేసి సినిమాలను ప్రమోట్‌ చేసుకుంటున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలకు పోరాటాలు కొత్త కాదని, రేపు నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి జనం తరలి రావాల‌ని పిలుపునిచ్చారు. ప్రజల హక్కులను కాలరాసే అధికారం పోలీసులకు లేదని, ఇబ్బంది పెట్టినవారెవరనీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని అనిల్ హెచ్చ‌రించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment