‘రాధాకృష్ణ‌ రాక్షస రాత‌లు’.. YS జగన్ సీరియస్ రియాక్షన్

'రాధాకృష్ణ‌ రాక్షస రాత‌లు'.. YS జగన్ సీరియస్ రియాక్షన్

వైసీపీ శ్రేణులు (YSR Congress Party Cadres), వారి కుటుంబ సభ్యుల (Family Members)పై ఆంధ్రజ్యోతి (Andhra Jyothy) అధినేత రాధాకృష్ణ (Radha Krishna) చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. అధికార గర్వంతో మహిళలను (women) కించపరిచేలా మాట్లాడుతున్నారని, దీనికి చంద్రబాబు (Nara Chandrababu Naidu), లోకేష్ (Nara Lokesh), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని, వీరంద‌రికీ కాలం, రాష్ట్ర ప్ర‌జ‌లు స‌రైన స‌మ‌యంలో స‌రైన‌ సమాధానం చెబుతుంద‌ని హెచ్చ‌రించారు.

వైసీపీ శ్రేణుల భార్య‌లు.. వారికి అక్క‌చెల్లెల్లు అంటూ వావివ‌ర‌స‌లు లేఖ వ్యాఖ్య‌ల‌ను ఏబీఎన్ ఛాన‌ల్‌లో (ABN channel) ఆర్కే త‌న స్వీయ రాత‌ల‌ను ప్ర‌సారం చేశారు. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా రాధాకృష్ణ చేసిన‌ వ్యాఖ్య‌ల‌ను చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేష్ ఖండించ‌క‌పోగా, హైద‌రాబాద్‌లో (Hyderabad) ఏబీఎన్ ఎదుట వైసీపీ చేసిన నిర‌స‌న‌ను దాడిగా అభివ‌ర్ణిస్తూ ఖండిస్తూ ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేశారు. దీనిపై వైసీపీ భ‌గ్గుమంటోంది.

ఈ నేప‌థ్యంలో రాధాకృష్ణ‌పై మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ నాయకుల భార్యల పట్ల రాధాకృష్ణ ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను తప్పుబట్టాల్సింది పోయి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు సమర్థిస్తారా అని నిలదీశారు. మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఇసుమంతైనా గౌరవం లేదని ఈ విష‌యంతో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌మైంద‌ని మండిపడ్డారు.

కూటమి నేతల ‘అరాచకాల’ చిట్టా
రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. జ‌న‌సేన ఎమ్మెల్యే (Jana Sena Party MLA) అరవ శ్రీధర్(Arava Sridhar) అరాచకాలను ప్రశ్నిస్తే, పోలీసుల సమక్షంలోనే ఆ బాధిత మహిళపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అర‌వింద‌బాబు ఎస్పీ ఆఫీసులోకి చొరబడితే దానికి చంద్రబాబు పంచాయతీ చేయడం ఏంటని ప్రశ్నించారు.

టీటీడీ చైర్మన్ ఒక మహిళ జీవితంతో చెలగాటం ఆడితే, కనీసం ఆ పదవి నుంచి కూడా తొలగించకుండా చంద్రబాబు వెంటేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. కేజీబీవీ ప్రిన్సిపల్‌ను (KGBV Principal) వేధించిన కూన రవికుమార్ (Koona Ravi Kumar), మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ మాట్లాడిన నసీర్ అహ్మద్ (Naseer Ahmed), లైంగిక దాడికి పాల్పడిన కోనేటి ఆదిమూలం (Koneti Adimulam) వంటి వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. మంత్రి సంధ్యారాణి (Sandhya Rani) పీఏ(PA) మీద కూడా చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు.

బాధితులపైనే కేసులు!
రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. అన్యాయం జరిగిన మహిళలకు న్యాయం చేయాల్సింది పోయి, తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒకర్ని చూసుకుని ఇంకొకరు తయారయ్యారు” అంటూ కూటమి నేతల తీరుపై జ‌గ‌న్‌ ధ్వజమెత్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment