రైతులను రౌడీల్లా చిత్రీక‌రిస్తారా..? చంద్రబాబుపై జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

రైతులను రౌడీల్లా చిత్రీక‌రిస్తారా..? చంద్రబాబుపై జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

మామిడి రైతుల (Mango Farmers) సమస్యలపై ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఆయన అనుకూల మీడియా అనుసరిస్తున్న వైఖరిపై వైసీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా (Chittoor District) బంగారుపాళెం (Bangarupalem) మామిడి మార్కెట్ యార్డ్‌ (Mango Market Yard)ను సందర్శించిన సందర్భంలో రైతులను (Farmers) రౌడీలుగా (Rowdies), అసాంఘిక శక్తులు (Anti-Social Forces)గా చిత్రీకరిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ విషయంపై వైఎస్ జ‌గ‌న్ తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

జగన్ తన ట్వీట్‌లో, “రైతులకు అండగా ఉండాల్సిన చంద్ర‌బాబు, వారి మనోభావాలను దెబ్బ‌తీస్తూ వెకిలి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. పాలకుడిగా చంద్రబాబు చెప్పుకోవడం దౌర్భాగ్యమని ప్రజలే చెబుతున్నారు” అని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో 2.2 లక్షల ఎకరాల్లో 6.5 లక్షల టన్నుల మామిడి పంటను 76,000 రైతు కుటుంబాలు సాగు చేశాయని, కానీ వారు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లేక రూ.2 నుంచి రూ.3 కిలో ధరకు పంటను అమ్మవలసి వచ్చిందని జగన్ గుర్తు చేశారు. ఈ పరిస్థితిని ప్రశ్నిస్తూ తాను బంగారుపాళెంలో రైతులను కలిసినప్పుడు, ప్రభుత్వం రైతులపై లాఠీఛార్జ్, అరెస్టులు, నోటీసులు జారీ చేయడం దారుణమని ఆయన ఆరోపించారు.

కూట‌మి స‌ర్కార్‌పై జగన్ మరింతగా మండిపడుతూ “రైతులు తమ బాధను వ్యక్తం చేస్తే వారిని రౌడీలుగా, దొంగలుగా చిత్రీకరించడం చంద్రబాబు సర్కారు నీచత్వాన్ని చాటుతోంది. కర్ణాటక ప్రభుత్వం కేంద్రం నుంచి కిలోకు రూ.16 ధరను సాధించగలిగితే, చంద్రబాబు ఎందుకు అలాంటి చర్యలు తీసుకోలేదు?” అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో మామిడి ధరలు కిలోకు రూ.25-29 ఉండగా, ఇప్పుడు ధరలు రూ.2.5-3కి పడిపోయాయని, రైతులు రోడ్లపై పండ్లను పారవేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీలను అందించకుండా, రైతు భరోసా కేంద్రాలను బలహీనపరిచిందని జగన్ ఆరోపించారు.

చంద్ర‌బాబు సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగి, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీదృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు… అంతేకదా చంద్రబాబూ అని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అంతేకాదు, అసలు వీరికి ఏ ఒక్కసమస్యాలేదని, అన్ని హామీలూ మీరు తీర్చేశారని, సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అందుకొని ఆనందంతో వీరంతా కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం. తమకు ధరలేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా, వీళ్లందరూ అసాంఘిక శక్తులు కాబట్టి వీరు రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం క‌దా.. ఇదేం పద్ధతి, ఇదేం విధానం చంద్రబాబు అని ప్ర‌శ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment