తిరుపతి (Tirupati) వేదిక మహిళా సాధికారత (Women Empowerment)పై రెండు రోజుల పాటు సాగే జాతీయ సదస్సు నేడు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా (Om Birla) హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnaraju), మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), బీజేపీ ఎంపీ పురందేశ్వరి (Purandeswari) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) మహిళా సాధికారత సదస్సు పాల్గొని మాట్లాడారు. మహిళల అవృభిద్ధికి మరికొన్ని తీర్మానాలు చేయాల్సి ఉందన్నారు. పార్టీలకు అతీతంగా మహిళా సాధికారత కోసం కృషి చేయాల్సి ఉందన్నారు. ఆస్తిలో మహిళలకు వాటా ఇవ్వాలని చట్టం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్(NTR) అని చెప్పారు. మహిళా సాధికారత కోసం చంద్రబాబు (Chandrababu) కృషి చేస్తున్నారని చెప్పారు.
జగన్‌పై విమర్శలు..
మహిళా సాధికారత సదస్సులోనూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan)పై పరోక్షంగా విమర్శలు చేశారు. చిరుద్యోగులు సైతం నో వర్క్.. నో పే.. అనే స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ ఎమ్మెల్యేలకు అది వర్తించదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు శాసనసభకు రావట్లేదని, ప్రజలు సమస్యలు పరిష్కరించడం అని ఓట్లేస్తే.. అసెంబ్లీకి రారా? అని ప్రశ్నించారు. ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అనేది లోక్ సభ స్పీకర్, పెద్దలందరూ పరిశీలించాలని కోరారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు..ఎమ్మెల్యేలకు ఆ నిబంధన లేదా?, ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చేయాలన్నది.. లోక్ సభ స్పీకర్ సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోక్ సభ స్పీకర్ కూడా ఆలోచించాలని స్పీకర్ వ్యాఖ్యానించారు.







