జ‌గ‌న్ క‌ష్టాన్ని చంద్ర‌బాబు చోరీ చేశాడా..? డేటా సెంట‌ర్ వాస్త‌వాలు

జ‌గ‌న్ క‌ష్టాన్ని చంద్ర‌బాబు చోరీ చేశాడా..? డేటా సెంట‌ర్ వాస్త‌వాలు

విశాఖ‌ప‌ట్ట‌ణానికి (Visakhapatnam) డేటా సెంట‌ర్ (Data Center) వ‌స్తోంది. ఢిల్లీ (Delhi)లో అట్ట‌హాసంగా దీనికి సంబంధించిన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఏపీ (AP) సీఎం చంద్ర‌బాబు  (Chandrababu)  ఆయ‌న త‌న‌యుడు, మంత్రి లోకేష్ (Lokesh) ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌ముఖుల‌తో సెల్పీలు దిగారు. ఏపీకి చేరిన త‌రువాత విశాఖ‌కు గూగుల్ డేటా సెంట‌ర్ (Google Data Center) వ‌స్తుంద‌ని రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్‌లు, ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌చారం నిర్వ‌హించారు.

అయితే డేటా సెంట‌ర్‌పై మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) సంచ‌ల‌న డాక్యుమెంట్ల‌ను మీడియా సాక్షిగా బ‌య‌ట‌పెట్టారు. డేటా సెంట‌ర్ క్రెడిట్‌ను చంద్ర‌బాబు చోరీ చేసి ప్ర‌చార ఆర్భాటాలు చేసుకుంటున్నాడ‌ని, రాష్ట్రంలో పాల‌న‌ను యాడ్ ఏజెన్సీ మాదిరిగా మార్చేశాడ‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

2020 నవంబరులో విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు బీజం పడగా, 2023, మే 3న దానికి శంకుస్థాపన చేశామ‌ని వైఎస్ జ‌గ‌న్ త‌న ప్రెస్‌మీట్‌లో ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టారు. అంత‌టితో ఆగ‌కుండా, సబ్‌సీ కేబుల్ (సముద్ర గర్భం నుంచి కేబుళ్ల) ఏర్పాటు, దాన్ని సింగపూర్‌ నుంచి తీసుకొచ్చే పనికి అంకురార్పణ కూడా అప్పుడే మొదలైందని చెప్పారు.

అదానీ డేటా సెంటర్‌కు వైసీపీ(YSRCP) హయాంలోనే ఫౌండేషన్‌ వేశామ‌ని, 2022లో త‌న ప్ర‌భుత్వ కృషి, కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం వ‌ల్ల ఈరోజు విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటవుతోందని, నాటి ప్రాజెక్టు విస్తరణే ఇప్పటి గూగుల్‌ డేటా సెంటర్ అని చెబుతూ కొన్ని కీల‌క డాక్యుమెంట్ల‌ను మీడియా ముందు పెట్టారు.

2022 అక్టోబ‌ర్‌ 11న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఒక కథనం ప్ర‌ద‌ర్శించిన జ‌గ‌న్‌.. అది నోయిడాలో ఏర్పాటువుతుండగా, ఇక్కడ 2023 మే 3న విశాఖలో భూమి పూజ చేయడం జరిగిందని వివ‌రిస్తూ.. స‌బ్ సీ కేబుల్‌ ఏర్పాటు కోసం 2021 మార్చి 9న సింగపూర్‌ ప్రభుత్వానికి కూడా లేఖ రాశామ‌ని ఆ లేఖ ప్రతిని కూడా చూపారు. 300 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్, కేంద్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చూపిన చొరవ ఇవ‌న్నీ వాస్త‌వాలు అంటూ ఆధారాలు చూపారు.

అదానీ పేరెందుకు ప్రస్తావించడం లేదు?
డేటా సెంట‌ర్ ప్రాజెక్టుకు సంబంధించి అదానీ గ్రూప్‌ ఏకంగా రూ.87 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి. అది ప్రపంచంలోనే చాలా పెద్దది. దాన్ని పూర్తిగా కడుతోంది అదానీ గ్రూప్‌. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్త‌యిన త‌రువాత గూగుల్‌ వస్తుంది. దానికి సంబంధించి హార్డ్‌వేర్‌ను గూగుల్‌ ఇస్తుంది.

ఏపీలో 10 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డి పెడుతున్న అదానీ గ్రూప్‌కు క్రెడిట్‌ ఇవ్వాలి కదా? చంద్రబాబు వారికి కనీసం థాంక్స్‌ చెప్పాడా? లేదు. ఎందుకంటే, ఎప్పుడైతే ఆ పేర్లు చెప్పడం మొదలుపెడతారో.. వెంటనే ఆ క్రెడిట్‌ మొత్తం వైసీపీకి, వైఎస్ జ‌గ‌న్‌కు వ‌స్తుంద‌నీ, అందుకే ఎక్కడా అదానీ పేరు లేకుండా, కేవలం గూగుల్‌ డేటా సెంటర్‌ అని మాత్రమే చెబుతున్నారు అని జ‌గ‌న్ వివ‌రించారు.

జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శించిన వాస్త‌వాలు ఈ విధంగా ఉంటే.. డేటా సెంట‌ర్‌ను తామే తెచ్చామ‌ని తెలుగుదేశం పార్టీ చెప్పుకోవ‌డం, దాన్ని విప‌రీతంగా ప్ర‌చారం చేసుకోవ‌డంపై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ మొద‌లైంది. జ‌గ‌న్ చూపించిన ఆధారాలు సోష‌ల్ మీడియాలో సైతం విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment