‘అందుకే చంద్రబాబును 420 అంటారు’ – జగన్

'అందుకే చంద్రబాబును 420 అంటారు' - జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రజలను విజన్-2047 పేరుతో మభ్యపెడుతున్నారని ఎక్స్ వేదిక‌గా జ‌గ‌న్‌ ఆరోపించారు.

జగన్ ఆరోపణల ముఖ్యాంశాలు
వైసీపీ హయాంలో చేపట్టిన పథకాలను చంద్రబాబు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. గత చంద్ర‌బాబు పాలనలో ప్రకటించిన విజన్లు కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. “సంపద సృష్టిస్తానంటూ ప్రభుత్వ ఆస్తులను ఆవిరి చేశారు, అందుకే ప్రజలు చంద్రబాబును 420 అంటారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ జ‌గ‌న్ ట్వీట్ తీవ్ర చ‌ర్చనీయాంశ‌మైంది. ఈ విమర్శలు రాజకీయం మరింత వేడెక్కించనున్నట్లు కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment