అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన భేటీ ప్రపంచ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు ఏర్పడ్డాయి. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో జరిగిన ఈ భేటీపై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం, వాణిజ్య సంబంధాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇరాన్‌లోని ఇటాలియన్ జర్నలిస్టు విడుదల వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సమావేశానికి సంబంధించి అధికారిక ప్రకటనలు అందుబాటులోకి రాలేదు.
ఇటాలియన్ జర్నలిస్టు అరెస్ట్ వివాదం
ఇటలీకి చెందిన ఒక జర్నలిస్టును ఇరాన్ పోలీసులు అరెస్టు చేయడం కూడా ఈ భేటీలో చర్చ చేసిన మరో ప్రధాన అంశంగా ఉన్నట్లు సమాచారం. ఇటలీ విదేశాంగశాఖ ఈ అరెస్టును ధ్రువీకరించింది.








