---Advertisement---

రెండోరోజు ఐటీ సోదాలు.. సినీ ఇండస్ట్రీలో కలకలం

రెండోరోజు ఐటీ సోదాలు.. సినీ ఇండస్ట్రీలో కలకలం
---Advertisement---

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖ నిర్మాత‌లపై ఇన్‌కం ట్యాక్స్ రైడ్స్ క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నిర్మాత‌ల ఇళ్ల‌లో ఐటీ శాఖ అధికారులు రెండోరోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో కార్యాలయాల్లో దర్యాప్తు జరుగుతోంది. ముఖ్యంగా ఈ సోదాలు పెద్ద సినిమాలకు పెట్టిన బడ్జెట్, ఐటీ రిటర్న్స్‌ మరియు డాక్యుమెంట్లను ఆరా తీయడంపై కేంద్రీకరించాయి.

బ్యాంక్‌కు దిల్ రాజు స‌తీమ‌ణి
నిన్న ప్ర‌ముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దిల్ రాజు ఇల్లు, ఆఫీస్‌పై ఐటీ సోదాలు జ‌రిగాయి. సుదీర్ఘ ప‌రిశీల‌న‌ల అనంత‌రం దిల్ రాజు భార్య తేజస్వినితో కలిసి బ్యాంకు లాకర్లు తెరిపించిన అధికారులు, ఇవాళ మరిన్ని కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. బడ్జెట్ లెక్కలు మరియు ఖర్చులపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ దర్యాప్తు జరిగింది.

55 బృందాలుగా ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్‌లో ఈ సోదాలు కొన‌సాగుతున్నాయి. దిల్ రాజు నివాసం, కూతురు హన్సిత నివాసం, సోదరుడు శిరీష్ నివాసాల్లో ఐటీ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం.. నవీన్ ఎర్నెని, రవి శంకర్ నివాసాలు.. మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్ళు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన భారీ సినిమాల పెట్టు బడులు, ఆదాయం పైన ఐటీ శాఖ ఆరా తీస్తోంది. ఆయా సంస్థల బాలెన్స్ షీట్స్ ను పరిశీలిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment