ఇరాన్‌ నుంచి ఢిల్లీకి 110 మంది భారత విద్యార్థులు

ఇరాన్‌ నుంచి 110 మంది భారత విద్యార్థులు ఢిల్లీకి

ప్రస్తుతం ఇరాన్‌ (Iran)లో నెలకొన్న యుద్ధ (War) వాతావరణం నేపథ్యంలో, అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులలో (Indian Students) 110 మందితో కూడిన తొలి బృందం ఢిల్లీ (Delhi)లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Indira Gandhi International Airport) చేరుకుంది. ఈ విద్యార్థులలో 90 మంది జమ్మూ కాశ్మీర్‌ (Jammu Kashmir)కు చెందినవారు కావడం విశేషం. ఇరాన్‌లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీకి (Urmia Medical University) చెందిన ఈ విద్యార్థుల బృందం అర్మేనియా (Armenia), దోహా (Doha) మీదుగా తరలివచ్చింది. వారు నిన్న (బుధవారం) సాయంత్రం ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కారు.

ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్ (Israel) దాడులతో అట్టుడుకుతోంది. అక్కడి భారతీయ విద్యార్థులు తమను స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని (Indian Government) అభ్యర్థిస్తున్నారు. ఈ విషయమై కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున నిరసనలు కూడా జరిగాయి. వివిధ నివేదికల ప్రకారం, ఇరాన్‌లో 13 వేలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారని, వీరిలో అధికశాతం వైద్య విద్యను అభ్యసిస్తున్నారని తెలుస్తోంది. భారతీయ విద్యార్థులను సకాలంలో తరలించినందుకు జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల సంఘం ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi)కి, విదేశాంగ మంత్రి (External Affairs Minister) ఎస్. జైశంకర్‌ (S.Jaishankar)కు కృతజ్ఞతలు తెలిపింది.

విద్యార్థుల కోసం ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు వెళ్లే విమానంతో సహా అన్ని విమాన టిక్కెట్లను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించినట్లు విద్యార్థుల సంఘం ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. ఇరాన్‌లో భారతీయ విద్యార్థులతో పాటు పలువురు పర్యాటకులు కూడా చిక్కుకుపోయారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసి, అక్కడి భారతీయులను వెంటనే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని కోరింది. టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) ఇరాన్ అణు కేంద్రాలపై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ (Operation Rising Lion) ప్రారంభించిన దరిమిలా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment