SRH ఆలౌట్.. ల‌క్ష్య‌ఛేద‌న‌లో త‌డ‌బడుతున్న ఢిల్లీ

SRH ఆలౌట్.. ల‌క్ష్య‌ఛేద‌న‌లో త‌డ‌బడుతున్న ఢిల్లీ

వైజాగ్ (Vizag) వేదికగా ఢిల్లీ క్యాపిట‌ల్‌ (Delhi Capitals) తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన SRH బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవ‌ర్ నుంచే వరుసగా వికెట్లు కోల్పోయినా, అనికేత్ వర్మ (Aniket Varma) విరుచుకుపడి ఆడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. వరుసగా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. అయితే చివరకు జెకేజర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అనికేత్ 74 పరుగుల వద్ద పెవిలియన్ చేరారు.

ఢిల్లీ క్యాపిట‌ల్ బౌలర్లలో స్టార్క్ (Starc) విజృంభించి 5 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. SRH 163 పరుగులకే ఆలౌట్ (All Out) అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 12 ఓవ‌ర్ల‌లో 119 స్కోర్ చేసి 3 వికెట్లు కోల్పోయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment