ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరైపోయాయా?

ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరైపోయాయా?

IPL 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రయాణం ఇక ముగిసినట్లేనా? ప్లే ఆఫ్స్ (Playoffs) అవకాశాలు గాలిలో కలిసిపోతున్నాయని క్రికెట్ విశ్లేషకులు (Cricket Analysts) అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి కేవలం 2 విజయాలే నమోదు చేయగలిగారు SRH. రన్‌రేట్ విషయంలో మరింత దారుణమైన స్థితిలో ఉంది జట్టు.

ఇక ఇప్పటికే 2 జట్లు 12 పాయింట్లను, మరో 4 జట్లు 10 పాయింట్లను సాధించాయి. ఇది చూస్తే మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచినా SRHకి ప్లే ఆఫ్స్ తలుపులు తెరవడం చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిన్న రాత్రి ముంబై ఇండియన్స్ చేతిలో జరిగిన మ్యాచ్‌లో SRH ఘోర ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ జట్టు తడబడింది. ఈ ఓటమితో SRH ఈ సీజన్‌లో దాదాపు వెనుకబడిపోయినట్లయింది. ఇప్పుడు మిగిలిన మ్యాచుల్లో SRH ఎలా ఆడతుందన్నదే ఆసక్తికరంగా మారింది. అయినా ప్లే ఆఫ్స్ ఆశలు పూర్తిగా చిందరవందరగా తయారయ్యాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment