టాలీవుడ్ సీక్రెట్ లవ్ కపుల్స్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – రష్మిక మందన్న (Rashmika Mandanna) జంట మరోసారి హాట్ టాపిక్ అయింది. రష్మిక బర్త్ డే సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ బీచ్ లొకేషన్‌కు వెకేషన్ (Vacation) కు వెళ్లినట్టు గాసిప్ వైరల్ అవుతోంది. ఇటీవల రష్మిక మందన్నా 29వ బర్త్ డే వేడుక (Birthday Celebration) ఒమన్ (Oman) లో జరుపుకుంది. తాజాగా ఆ ఫొటోలు, వీడియోలను విడుదల చేసింది. విజయ్ కూడా బీచ్ (Beach) లో దిగిన ఫొటోలు విడుదలయ్యాయి.
వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలలో బ్యాక్‌గ్రౌండ్ ఒకేలా ఉండటంతో, ఫ్యాన్స్ దుమారం రేపుతున్నారు. “ఇది యాదృచ్ఛికమా? లేక మరో హింటా?” అని ట్వీట్స్ చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఫొటోలు చూసి వారి మధ్య ఉన్న బంధాన్ని ఫ్యాన్స్ బయటపెట్టారు.
ఇప్పుడు కూడా ఈ జంట ఒకే ప్లేస్ (Place) నుండి ఫొటోలు (Photos) దిగి షేర్ చేశారని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. మరోసారి “వీరు కలిసి వెకేషన్‌కు వెళ్లారా?” అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అధికారికంగా వీరిద్దరూ ఏమీ వెల్లడించకపోయినా, ఇలా ప్రతిసారీ ఫొటోల ద్వారా వారిద్దరి మధ్య స్పెషల్ బాండ్ గురించి ఫ్యాన్స్‌కు సంకేతాలు ఇస్తేనే ఉన్నారంటున్నారు సినీ విశ్లేషకులు.








