ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy) టోర్నీలో హైఓల్టేజ్ భారత్-పాకిస్తాన్ (IND vs PAK) మ్యాచ్ మరి కొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. దాయాదీల బిగ్గెస్ట్ ఫైట్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ రెట్టింపు అయ్యింది. ఈ ప్రతిష్ఠాత్మక పోరులో టీమ్ ఇండియా (Team India) విజయం సాధించాలని కోరుతూ యూపీ రాష్ట్రంలోని వారణాసిలో భక్తులు ప్రత్యేక పూజలు (Varanasi Prayers) నిర్వహిస్తున్నారు. క్రికెట్ బ్యాట్లు, జెర్సీలను పక్కన ఉంచి యజ్ఞాలు చేస్తూ, టీమిండియా క్రికెటర్ల పోస్టర్ల ముందు హారతులు ఇస్తూ భారత జట్టు గెలవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
అంతేకాదు, దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే విధంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. India vs Pakistan మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభంకానుండగా, జియో సినిమాస్, స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.