ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ నవంబర్ 14 నుంచి ఖతార్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం బీసీసీఐ జితేశ్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్) నేతృత్వంలో 15 మంది సభ్యులతో కూడిన భారత్ ‘ఎ’ జట్టును ప్రకటించింది. నమన్ ధిర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ, నేహాల్ వధేరా, యశ్ ఠాకూర్, విజయ్‌కుమార్ వైశాఖ్, సుయాంశ్ శర్మ వంటి పలువురు ఐపీఎల్ స్టార్స్ స్థానం సంపాదించుకున్నారు. ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 14న యూఏఈతో ఆడనుంది. క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నవంబర్ 16న జరగనుంది.
భారత్ ‘ఎ’ జట్టు తమ షెడ్యూల్లో నవంబర్ 18న ఒమన్‌తో మూడో మ్యాచ్ ఆడనుంది. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో సీనియర్ జట్టు ఆధిపత్యాన్ని కొనసాగించిన విధంగానే, యువ భారత్ జట్టు కూడా ఈ రైజింగ్ స్టార్స్ టోర్నీలో సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గుర్నూర్ సింగ్ బ్రార్, కుమార్ కుశాగ్ర వంటి ఐదుగురు ఆటగాళ్లను స్టాండ్ బై జాబితాలో ఉంచారు. భారత క్రికెట్ భవిష్యత్తును ప్రతిబింబించే ఈ యువ జట్టు ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.








