Asia Cup : ఒమన్‌పై భారత్ గెలుపు ఖాయమా?

ఆసియా కప్‌లో చివరి గ్రూప్ మ్యాచ్: ఒమన్‌పై భారత్ గెలుపు ఖాయమా?

ఆసియా కప్ (Asia Cup) 2025లో భారత జట్టు (India Team) తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఒమన్‌ (Oman)తో తలపడనుంది. ఆదివారం పాకిస్థాన్‌ (Pakistan)తో జరగబోయే కీలకమైన సూపర్ 4 మ్యాచ్‌కు సన్నాహకంగా ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే యూఏఈ(UAE), పాకిస్థాన్‌ (Pakistan)లపై అద్భుతమైన విజయాలు సాధించిన భారత్ జట్టు, పసికూన ఒమన్‌ను ఓడించడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అబుదాబి (Abu Dhabi)లోని షేక్ జాయెద్ (Sheikh Zayed) స్టేడియం (Stadium)లో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో రెండు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. అబుదాబి పిచ్ స్పిన్నర్లకు పెద్దగా సహకరించే అవకాశం లేనందున, కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తిలలో ఒకరికే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కవచ్చు. అర్ష్‌దీప్‌తో పాటు హర్షిత్ రాణా కూడా జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం, భారత్ ముందుగా బ్యాటింగ్ చేయడానికే మొగ్గుచూపే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా):

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి.

ఒమన్‌: జతిందర్, కలీమ్, హమద్, వసీమ్, ఆర్యన్, వినాయక్, జితేన్, ఫైసల్, షకీల్, హొస్సేన్‌ షా, సమయ్‌.

Join WhatsApp

Join Now

Leave a Comment