ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025)లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. దుబాయ్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ (India Vs Bangladesh)ల మధ్య సమరం గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలు కానుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన.. గట్టి ఫామ్‌లో ఉంది. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) మెరుగైన ఫామ్‌లో ఉండటంతో బంగ్లాదేశ్‌పై గెలుపు పెద్దగా సవాలుగా అనిపించకపోవచ్చు.
అయితే, బౌలింగ్ దిగ్గజం బుమ్రా లేకపోవడం భారత బౌలింగ్ దళానికి పరీక్షగా మారనుంది. అటు బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయకూడదని, దూకుడుగా ఆడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
తొలి మ్యాచ్‌లో పాక్ చిత్తు
ఎనిమిదేళ్ల తరువాత ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య బుధవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్‌ను న్యూజిలాండ్ మట్టికరిపించింది. నిర్ణిత 50 ఓవర్ల మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 320 భారీ స్కోర్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన పాక్ 48 ఓవర్లకు 260 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఈ టర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది.