అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు (Team India) 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాకు (South Africa) ఓడిపోయింది. ఈ పరాజయంతో టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా వరుస విజయాల సిరీస్ (12) ముగిసింది. ప్రస్తుతం భారత్ సెమీస్‌కు చేరే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. సూర్య సేన ఆట తీరు నిలకడగా మారకుంటే, సెమీస్ ఫైనల్ పోరులో ముందుకు వెళ్లడం చాలా కష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ సెమీస్‌లో చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఈ పరాజయంతో భారత్ నెట్ రన్ రేట్ -3.800కి చేరింది, అయితే దక్షిణాఫ్రికా 2 పాయింట్లతో గ్రూప్ 1లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
టీమ్ ఇండియాకు సూపర్-8లో జింబాబ్వే (Zimbabwe), వెస్టిండీస్ (West Indies)తో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే మాత్రమే భారత్ సెమీస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ఒక్క మ్యాచులో విజయం సాధిస్తే, జట్టుకు పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా మిగిలిన రెండు మ్యాచుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. వెస్టిండీస్-జింబాబ్వే మధ్య మ్యాచ్‌లో విజేతను భారత్ ఓడించాలి. ఈ సన్నివేశంలో నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది. అందువల్ల, ప్రస్తుతం భారత ఆటగాళ్లు తమ ఆటిట్యూడ్‌లో (Attitude) మార్పు చేసి, మరింత శ్రద్ధగా ఆడాల్సిన అవసరం ఉందని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.








