భారత్ vs దక్షిణాఫ్రికా టెస్ట్.. హాట్ కేకుల్లా టికెట్ల సేల్!

భారత్ vs దక్షిణాఫ్రికా టెస్ట్: టికెట్లు హాట్ కేకుల్లా సేల్!

భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా, నవంబర్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరుగుతుండడంతో ఈ తొలి మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ మ్యాచ్ కోసం నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. టెస్ట్ మ్యాచ్ టికెట్ల ధరలను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) చాలా తక్కువగా నిర్ణయించింది. కనిష్టంగా రోజుకు కేవలం ₹60గా, గరిష్టంగా రోజుకు ₹250గా ధరలు ఉన్నాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో CAB సంతోషం వ్యక్తం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment