భారత్‌లోనే యుద్ధ విమానాల ఉత్పత్తి.. ఇక‌పై ఎవ‌రొచ్చినా..

భారత్‌లోనే యుద్ధ విమానాల ఉత్పత్తి.. ఇక‌పై ఎవ‌రొచ్చినా..

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే కాదు, సైనిక శక్తిలోనూ అగ్రరాజ్యాల సరసన నిలిచేందుకు భారత్ (India) నిరంతరం ప్రయత్నిస్తోంది. భారత్‌తో సరిహద్దులు పంచుకుంటూ శత్రువైఖరిని ప్రదర్శిస్తున్న చైనా (China), పాకిస్థాన్ (Pakistan) దేశాలు ఇప్పటికే 5వ తరం యుద్ధ విమానాలను కలిగి ఉండగా, భారత్ 4.5 జనరేషన్ యుద్ధ విమానమైనా రఫేల్‌ (Rafale)వ తరం ఫైటర్ జెట్లను సమకూర్చుకోవడమే కాదు, వాటిని భారత్‌లోనే తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఈ క్రమంలో భారత వాయుసేనకు మరింత బలాన్ని చేకూర్చేలా, భారత్–రష్యా (India-Russia) మధ్య కీలకమైన రక్షణ ఒప్పందానికి లైన్ క్లియర్ అయింది. ఇందులో భాగంగా రష్యా, భారత్‌కు ఆధునిక యుద్ధ విమానాలను అందించేందుకు ముందుకొచ్చింది. వాటిలో Su-57E ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్‌ జెట్‌ను భారత్‌లోనే తయారుచేసేందుకు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ (Technology) చేయనుండగా, Su-35M అనే 4.5 తరం ఎయిర్ సుపీరియారిటీ అత్యాధునిక యుద్ధవిమానాలను వెంటనే పంపించేందుకు రష్యా సిద్ధంగా ఉంది.

Su-57E – భారత్‌లో తయారీకి మార్గం సుగమం
రష్యా ప్రభుత్వ రంగ సంస్థ రోస్టెక్ (Rostec), విమాన తయారీ దిగ్గజం సుఖోయ్ (Sukhoi) ఈ ప్రతిపాదనను ఇటీవల భారత ప్రభుత్వానికి అందించాయి. ఇందులో Su-57E (5వ తరం స్టెల్త్ యుద్ధవిమానం) పూర్తి టెక్నాలజీని భారత్‌కు బదిలీ చేయనున్నారు. ఈ విమానాల తయారీ HAL (హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) నాసిక్ ప్లాంట్‌లో జరగనుంది. ఇదే ప్లాంట్ ఇప్పటికే 220 కంటే ఎక్కువ Su-30MKI యుద్ధవిమానాలను తయారు చేసింది. మొదట 20-30 Su-57E జెట్లను రష్యాలోనే తయారు చేసి భారత్‌కు అందజేసిన అనంతరం, 3-4 సంవత్సరాల్లో భారత్‌లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా 2030 నాటికి 60-70 కొత్త స్టెల్త్ ఫైటర్లు భారత వాయుసేనలో చేరే అవకాశం ఉంది.

నేరుగా భారత్‌కు రెడీమేడ్ Su-35M జెట్లు
IAF అవసరాలకు అనుగుణంగా మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) టెండర్‌లో భాగంగా మొత్తం 114 Su-35M ఫైటర్ జెట్లను రష్యా నేరుగా సరఫరా చేయనుంది. ఇప్పటికే భారత వాయుసేన వద్ద ఉన్న Su-30MKIతో పోల్చితే, Su-35Mలో దాదాపు 70-80% సాంకేతిక సామాన్యత ఉంటుంది. దీంతో పైలట్లకు, గ్రౌండ్ సిబ్బందికి పెద్దగా అదనపు శిక్షణ అవసరం ఉండదు. ఇది భారత వాయుసేన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment