భారత్ – పాకిస్తాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలకు (Tensions)విరామం లభించింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ (Ceasefire) కు అంగీకరించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. విక్రమ్ మిస్రీ వివరాల ప్రకారం.. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తెలిపారు. మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో పాకిస్తాన్ డీజీఎంఓ (DGMO) భారత డీజీఎంఓకి ఫోన్ చేసి కాల్పులను ఆపాలని విజ్ఞప్తి చేశారని, పాక్ అభ్యర్థన మేరకు కాల్పున విరమణకు భారత్ అంగీకరించినట్లుగా మిస్రీ వివరించారు. కాగా, ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నట్లు చెప్పారు. ఈ చర్చలు ఎక్కడ జరుగుతాయన్నది త్వరలో వెల్లడిస్తామన్నారు.
పాకిస్తాన్ మంత్రి ఇషాక్ దర్ కూడా ఈ ఒప్పందాన్ని ధృవీకరించారు. ఈ పరిణామంతో ‘ఆపరేషన్ సిందూర్’కు తాత్కాలిక విరామం లభించినట్లు తెలుస్తోంది. భారత్ – పాక్ మధ్య ఈ చర్చల వెనుక అమెరికా కీలక భూమిక పోషించినట్లుగా అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ద్వారా స్పష్టమవుతోంది. అమెరికా కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ.. ఈ చర్చలు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సమక్షంలో సాగినట్లు తెలిపారు. భారత్ ప్రధాని, విదేశాంగ మంత్రి శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అలాగే పాక్ ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ అసిఫ్ మునీర్, పాక్ ఎన్ఎస్ఏ మాలిక్ సమక్షంలో జరిపామన్నారు. ఈ మేరకు భారత్ – పాక్ కాల్పుల విరమణకు అమెరికా దౌత్య చొరవ కారణమైందని రూబియో స్పష్టం చేశారు.
🚨🚨 BIG BREAKING 🚨🚨
— Telugu Feed (@Telugufeedsite) May 10, 2025
కాల్పుల విరమణ ప్రకటించిన భారత్
కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పందం
ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ#IndianArmy #IndiaPakisthanWar #CeasefireNow pic.twitter.com/39OX6QPK8y








