క్రికెట్‌లో భారత్ (టీమిండియా) (Team India) తిరుగులేని డామినేషన్ చూపిస్తోంది. పురుషులు, మహిళల జట్లు రెండూ వరుస విజయాలతో దూసుకుపోతుండగా, దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) మాత్రం ఆ ఒత్తిడిని భరించలేక ఓటములతో వెనుకబడిపోతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, క్రికెట్ మైదానంలోనూ అదే ఆధిపత్యం కనిపిస్తోంది.
ఆసియా కప్‌లో టీమిండియా పాకిస్థాన్‌తో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ముందు పాక్ ఏమాత్రం నిలబడలేకపోయింది. మహిళల వన్డే వరల్డ్‌కప్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. భారత మహిళల జట్టు అప్రతిహతంగా దూసుకుపోతుండగా, పాక్ జట్టు నిరాశపరుస్తోంది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫిట్‌నెస్ స్థాయితో సహా అన్ని విభాగాల్లో టీమిండియా ఆటగాళ్లు పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఉండటంతో… “భారత్ డామినేషన్‌ను పాకిస్థాన్ తట్టుకోలేకపోతోందన్న” కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. క్రీడా ప్రపంచంలో అన్నింటా మన ఆధిపత్యమే కనిపిస్తోంది.







