ఆస్ట్రేలియా 181 ఆలౌట్.. భారత బౌలర్ల హ‌వా

ఆస్ట్రేలియా 181 ఆలౌట్.. భారత బౌలర్ల హ‌వా

సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఆస్ట్రేలియా జట్టును కేవలం 181 పరుగులకు ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌లో వెబ్‌స్టర్ హాఫ్ సెంచరీతో రాణించి 57 పరుగులు చేసి ఔటయ్యాడు. భారత బౌలింగ్‌లో సిరాజ్, ప్రసిద్ కృష్ణ మూడు వికెట్లు చొప్పున‌ తీసి ప్రతిభ చూపించగా, నితీశ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు సాధించాడు. బౌలర్ల సమష్టి కృషితో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలింది.

రెండో ఇన్నింగ్స్‌లో..
భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. కేవలం 7 ఓవర్లలోనే 39 పరుగులు సాధించింది. యశ‌స్వీ జైస్వాల్ 22 పరుగుల చేసిన ఆసిస్ బౌల‌ర్ల‌కు దొరికేశాడు. కేఎల్ రాహుల్ 11 పరుగులు చేసి క్రీజులోంచి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం భార‌త్ 6 వికెట్ల న‌ష్టానికి 141 ప‌రుగులు చేసింది. క్రీజ్‌లో ర‌వీంద్ర జ‌డేజా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment