భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 164 పరుగులు చేసి 5 వికెట్లు నష్టపోయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 474కు భారత్ 310 పరుగుల వెనుకబడి ఉంది.
టీమిండియా బ్యాటర్స్ యశస్వి జైస్వాల్ (82), రాహుల్ (24), కోహ్లి (36) కాస్తంత మెరుగైన ప్రదర్శన చేశారు. ప్రస్తుతం జడేజా (4) మరియు పంత్ (6) క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మరో బ్యాట్స్‌మెన్ అక్షదీప్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు, ఆసీస్ బౌలర్లు ప్యాట్రిక్ కమిన్స్, స్కాట్ బోలాండ్ తలో రెండు వికెట్లు తీయడం ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్కోర్‌ను బీట్ చేయాలంటే ప్రస్తుతం చేతిలో 5 వికెట్లతో టీమిండియా 310 పరుగులు చేయాల్సి ఉంది. మరి మూడోరోజు ఆటలో ఆ స్కోర్‌ను సాధిస్తారా లేక ఆసిస్ బౌలర్ల ధాటికి చేతులు ఎత్తేస్తారా అనేది వేచి చూడాలి.








