ఏపీకి పొరుగు రాష్ట్రాల మద్యం.. కొత్త లిక్కర్ పాలసీపై సందేహాలు

ఏపీలో పొరుగు రాష్ట్రాల మద్యం.. కొత్త లిక్కర్ పాలసీపై సందేహాలు

ఆంధ్రప్రదేశ్‌లో కూట‌మి పార్టీలు అధికారంలోకి వ‌చ్చిన అనంత‌రం కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి తీసుకువ‌చ్చారు. రూ.99కే మ‌ద్యం అని ప్ర‌క‌టించిన మందుబాబుల‌ను ఆక‌ట్టుకున్న ప్ర‌భుత్వం, మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాను మాత్రం అరిక‌ట్ట‌లేక‌పోతుంద‌నే వ‌ధంతులు వినిపిస్తున్నాయి.

నూత‌న లిక్క‌ర్ పాల‌సీ రాగానే మద్యం అక్ర‌మ ర‌వాణా తగ్గిపోతుందని భావించేవారు. అయితే, ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల నుండి ఏపీలోకి మద్యం అక్రమంగా వస్తూనే ఉంది. ఈ ఏడాది నవంబర్ వరకు, ఎక్సైజ్, పోలీస్ శాఖలు సుమారు 1.89 లక్షల లీటర్ల మద్యం పట్టుకుని సీజ్ చేశాయి.

ఇక, ఈ నెలలో అనంతపురంలో సీజ్ చేసిన 30,000 బాటిళ్లను కలిపితే, మొత్తం సీజ్ చేసిన మద్యం 2 లక్షల లీటర్లను దాటిపోవడం అంటే.. అధిక ధరలతో కొన్ని బ్రాండ్లకు ఉన్న డిమాండ్ కూడా ఈ అక్రమ వ్యాపారానికి కారణమని తెలిసింది. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 71,365 లీటర్ల మద్యం మాత్రమే సీజ్ చేసినట్టు గుర్తించిన అధికారులు, కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌ద్యం అక్ర‌మ ర‌వాణా పెర‌గ‌డంపై తీవ్ర చర్చలు జరుపుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment