గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) ని హుటాహుటిన ముంబై (Mumbai) కి తరలించారు. డాక్టర్ల సూచనల మేరకు మెరుగైన వైద్య సేవల కోసం ప్రత్యేక విమానం (Special Flight) లో కొడాలి నానిని ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన కొడాలి నానిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏషియన్ ఆస్పత్రి (Asian Hospital) లో చేర్పించారు. గుండెలో మూడు వాల్వ్స్ లో బ్లాకులు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు సర్జరీ అవసరమని కుటుంబ సభ్యులకు చెప్పినట్లుగా సమాచారం. గుండెకు సంబంధించి సమస్యతో బాధపడుతున్న కొడాలి నానిని, కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
News Wire
-
01
అలిపిరి దగ్గర భారీగా నగదు పట్టివేత
రూ.65 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న టీటీడీ విజిలెన్స్.
-
02
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా
టీం ఇండియాకు బీసీసీఐ రూ.131 కోట్ల భారీ నజరానా. T20-2026 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం
-
03
పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్
గ్యాస్ కొరతతో ముంబైలో 20 శాతం హోటళ్లు బంద్. పరిస్థితి ఇలానే కొనసాగితే 50 శాతం హెటళ్లు మూతపడే అవకాశం.
-
04
గ్రామ పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ
ఏపీలో జనాభా, ఆదాయం ఆధారంగా పంచాయతీల పునర్ వర్గీకరణ. 10వేల జనాభా ఉంటే రూర్బన్ పంచాయతీలుగా నిర్ణయం.
-
05
చమురుశుద్ధి సంస్థలపై ఎస్మా
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కు కృత్రిమ కొరత ష్టించకుండా కేంద్రం నిర్ణయం. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా చర్యలు.
-
06
మార్చి 7 వరకూ అసెంబ్లీ సమావేశాలు
17 పనిదినాలు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 14న వార్షిక బడ్జెట్.
-
07
అంబటి రాంబాబుకు బెయిల్
గతేడాది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో ర్యాలీ కేసు నమోదు. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు.
-
08
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ పెట్రోల్ బాంబ్ దాడి. జోగి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
-
09
పాతూరు వద్ద పోలీస్ చెక్ పోస్ట్..
వైయస్ జగన్ కాన్వాయ్ తో వస్తున్న వాహనాలు అడ్డగింత. కార్లు, బైక్ లను నిలిపేస్తున్న పోలీసులు.
-
10
జగన్ పర్యటనతో వైసీపీ నేతలకు నోటీసులు
జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్‌లకు నోటీసులు.ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించొద్దని పోలీసులు.








