భారతీయుడి చేతికి ఐసీసీ పగ్గాలు

ఐసీసీ పగ్గాలు భారతీయుడికి

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కొత్త సీఈఓగా (New CEO) సంజోగ్ గుప్తా (Sanjog Gupta) నియమితులయ్యారు. సోమవారం, జూలై 7, 2025న ఆయన దుబాయ్‌ (Dubai)లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ చరిత్రలో ఈ కీలక పదవిని చేపట్టిన ఏడో వ్యక్తి సంజోగ్. ప్రపంచ క్రికెట్‌ (Cricket)ను పరివర్తనాత్మక భవిష్యత్తు వైపు నడిపించేందుకు సంజోగ్ గుప్తాకు స్వాగతం పలుకుతున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

సంజోగ్ గుప్తా ప్రస్థానం
సంజోగ్ గుప్తా గతంలో జియోస్టార్ స్పోర్ట్స్ (JioStar Sports), లైవ్ ఎక్స్‌పీరియన్స్ (Live Experience) విభాగం సీఈఓగా పనిచేశారు. ఈ కీలక పరిణామంలో ఐసీసీ సంజోగ్‌ను తమ వైపునకు తిప్పుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ అలార్డైస్ (Geoff Allardice) నాలుగేళ్లు సీఈఓగా పనిచేశారు. జనవరి 2025లో అతను రాజీనామా చేసిన తర్వాత ఆ పదవి ఖాళీగా ఉంది.

ఐసీసీ సీఈఓ స్థానం కోసం 25 దేశాల నుండి 2,500 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఐసీసీ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా నేతృత్వంలోని నామినేషన్స్ కమిటీ 12 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసింది. ఆ తర్వాత సీఈఓ స్థానానికి సంజోగ్ గుప్తా పేరును సిఫార్సు చేశారు. ఐసీసీ ఛైర్మన్ జయ్ షా ఆమోదం తెలిపిన తర్వాత, సంజోగ్‌ను ఐసీసీ సీఈఓగా నియమించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment