లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య

లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ (Hyderabad) సిటీలోని లాలాగూడ (Lalaguda) ప్రాంతంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. వాలీబాల్ కోచ్ (Volleyball Coach) వేధింపులు భరించలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తార్నాకలోని రైల్వే డిగ్రీ కళాశాలలో మౌలిక అనే విద్యార్థిని సెకండ్ ఇయర్ చదువుతోంది. వాలీబాల్ కోచ్ అయిన అంబాజీ తనను ప్రేమించాలంటూ మౌలికను తరచూ వేధించేవాడు. కోచ్ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన మౌలిక, ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు మౌలిక, ప్రమోద్ కుమార్ మరియు హరిత దంపతుల రెండో సంతానం. ప్రమోద్ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి గా పనిచేస్తున్నారు.

ఆత్మహత్య: కళాశాల నుంచి ఇంటికి వచ్చిన మౌలిక, కుటుంబ సభ్యులతో మాట్లాడిన కొద్దిసేపటికే గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. ఆ తరువాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారి సహాయంతో కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దించి, పోలీసులకు సమాచారం అందించారు. లాలాగూడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మౌలిక  (Moulikha), ఆత్మహత్యపై ఆమె అన్న చంద్రవర్ధన్ మరియు తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “మా చెల్లి ఆత్మహత్యకు కోచే కారణమని అన్న ఆవేదన చెందారు.

“మౌలిక కాలేజీలోనే టాప్ స్టూడెంట్. క్లాసికల్ డాన్సర్, బెస్ట్ స్విమ్మర్. ఎలాంటి బైక్ అయినా సులభంగా నడపగలిగే ధైర్యవంతురాలు. అలాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం మాకు అర్థం కావడం లేదు. బయటకు వెళ్లి వచ్చే అరగంటలో ఏం జరిగిందో మాకు తెలియాలి. మౌలిక ఫోన్‌ను తనిఖీ చేసినా మాకు ఎలాంటి అనుమానం రాలేదు. కానీ, తన స్నేహితురాళ్లు మాత్రం వాలీబాల్ కోచ్ ప్రేమ పేరుతో ఆరు నెలలుగా వేధించేవాడని చెప్పారు. ఈ విషయం మాకు తెలిసుంటే మా కూతురిని కాపాడుకునేవాళ్లం.”

కుటుంబం పోలీసులను, సమాజాన్ని కోరుతూ.. “ఇలాంటి ఘటన మరో కుటుంబంలో జరగకుండా చూడాలి. స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే వారి తల్లిదండ్రులకు చెప్పండి. నా కూతురు ఆత్మహత్యకు ప్రేమ వేధింపులే కారణమైతే, ఆ వాలీబాల్ కోచ్‌ను కఠినంగా శిక్షించాలి” అని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదుపై దర్యాప్తును వేగవంతం చేశారు మరియు కోచ్ అంబాజీ పాత్రపై పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment