Hyderabad : డ్రగ్స్ బానిసై రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన లేడీ డాక్ట‌ర్‌

Hyderabad : డ్రగ్స్ బానిసై రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన లేడీ డాక్ట‌ర్‌

హైదరాబాద్‌ (Hyderabad) లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ (Doctor) కోకైన్‌ (Cocaine) మత్తుకు బానిసైన ఘటన సంచలనం రేపుతోంది. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన వైద్యురాలు స్వయంగా నిషేధిత మత్తు పదార్థాలకు బానిసగా మారినట్టుగా పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం
హైదరాబాద్‌ షేక్‌పేటలోని ఏపీఏహెచ్‌సీ కాలనీలో నివాసముంటున్న డాక్టర్ చిగురుపాటి నమ్రత (Chigurupati Namratha) (వయసు 34) ప్రస్తుతం సిటీలోని ఓ ప్రఖ్యాత ఆసుపత్రికి సీఈవో (CEO)గా ఉన్నారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఆమె కొకైన్‌ వంటి నిషేధిత మత్తు పదార్థాలను వినియోగిస్తూ డ్రగ్స్‌(Drugs)కు అలవాటు పడినట్టు వెల్లడైంది.

ఈ క్రమంలో ముంబైలో(Mumbai) నివాసముండే వాన్స్‌ టక్కర్‌ అనే వ్యక్తిని వాట్సాప్‌ ద్వారా సంప్రదించి, రూ.5 లక్షల విలువైన కొకైన్‌ను ఆర్డర్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ మొత్తాన్ని నమ్రత ఆన్‌లైన్‌ ద్వారా టక్కర్‌కు చెల్లించారు. అనంతరం, టక్కర్‌ తన వద్ద డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న బాలకృష్ణ రాంప్యార్‌ రామ్‌ (38) అనే వ్యక్తితో డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు పంపించాడు.

రాయదుర్గంలో డాక్టర్ నమ్రతను కలిసిన రాంప్యార్‌ రామ్‌ ఆమెకు డ్రగ్స్‌ అందజేస్తుండగా, ముందుగా సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల మాదకద్రవ్య సంబంధాలు, మిగతా రవాణా నెట్‌వ‌ర్క్‌ గురించి వివ‌రాలు వెలికితీస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment