గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదం.. విచారణ కమిటీ నియామ‌కం

గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంపై విచారణ కమిటీ

హైదరాబాద్‌ (Hyderabad) లో ఇటీవల జరిగిన గుల్జార్ హౌజ్ (Gulzar Houz) అగ్నిప్రమాదం (Fire Accident)పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) అప్ర‌మ‌త్త‌మైంది. ఘ‌ట‌న‌కు సంబంధించి సమగ్ర విచారణ కోసం ప్రత్యేక కమిటీ (Special Committee)ని ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిటీ మొత్తం ఆరుగురు సభ్యులతో రూపొందించారు.

ఈ కమిటీ సభ్యులుగా జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner), హైదరాబాద్ కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, తెలంగాణ స్టేట్ సదన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSSPDCL) సీఎండీ ముషారఫ్ లు ఉన్నారు.

కమిటీ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి విచారణ నిర్వహించి నివేదికను ముఖ్యమంత్రి (Chief Minister) కి సమర్పించనుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది దుర్మరణం పాలయ్యారు. అగ్నిప్రమాదం కారణాలు, బాధ్యతలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదిక సమర్పించనుంది. ఈ సంఘటన నగర భద్రత మరియు అగ్నిప్రమాద నివారణ వ్యవస్థలపై అనేక ప్రశ్నలు రేపింది. ప్రభుత్వం చర్యలకు ఉప‌క్ర‌మించిన‌ప్ప‌టికీ, నివేదిక ఆధారంగా మరిన్ని విధానపరమైన మార్పులు రావచ్చని భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment