భారత్ కీల‌క‌ నిర్ణయం.. పాక్‌కు మ‌రో షాక్

భారత్ కీల‌క‌ నిర్ణయం.. పాక్‌కు మ‌రో షాక్

పహల్గామ్ (Pahalgam) ఉగ్రవాద దాడికి (Terrorist Attack) ప్రతిస్పందనగా ప్ర‌త్య‌ర్థి దేశం పాకిస్తాన్‌ (Pakistan)ను భార‌త్ (India) దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే సింధూ న‌ది జ‌లాల‌ను (Indus river waters) నిలిపివేసిన భార‌త్‌.. పాక్‌కు మ‌రో షాక్ ఇస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశ భద్రత దృష్ట్యా పాకిస్తాన్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై (Imports) నిషేధం(Ban) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం (Central Government) గట్టి చర్యలు చేపట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో “పాకిస్తాన్‌లో తయారయ్యే లేదా లభించే అన్ని వస్తువుల దిగుమతులను తక్షణం నుంచి నిషేధిస్తున్నాం. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అయినా పాక్ ఉత్పత్తులు భారత్‌కు రాకూడదు. ఈ నిషేధం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతుంది” అని పేర్కొంది.

జాతీయ భద్రతే ప్రథమం
ఈ చర్యకు ప్రధాన కారణం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి. 26 మంది అమాయ‌క టూరిస్టులు ప్రాణాలను కోల్పోయిన ఈ దాడి దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలను రేపింది. దాంతో కేంద్రం పబ్లిక్ పాలసీ (Public Policy), నేషనల్ సెక్యూరిటీ (National Security) కారణాలను ముందుంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం తర్వాత కూడా అవసరమైతే ఎలాంటి వస్తువులైనా దిగుమతి చేసుకోవాలంటే, కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ నిర్ణయం పాక్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. గతంలోనూ పుల్వామా దాడి అనంతరం ఇలాంటి చర్యలు తీసుకున్న భారత్, మరోసారి పాక్‌కు గట్టి హెచ్చరిక ఇచ్చినట్లు అయ్యింది.

Join WhatsApp

Join Now

Leave a Comment