కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో ఆరుగురు అనుమానితులు.. పహల్గామ్ దాడికి లింకుందా?

కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో ఆరుగురు అనుమానితులు.. పహల్గామ్ దాడికి లింకుందా?

Summarize with AI

శ్రీలంక రాజధాని కొలంబో (Colombo)లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ (International Airport) లో ఆరుగురు అనుమానితులను (Six Suspects) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత నిఘా వర్గాల నుంచి అందిన స్పెషల్ ఇన్‌పుట్ (Special Input) ఆధారంగా ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు తనిఖీలు జరిపారు. ఆ తనిఖీల్లో భాగంగా వీరిని అరెస్ట్ చేసినట్టు సమాచారం.

పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తులు చెన్నై (Chennai) నుంచి కొలంబోకు (Colombo) వచ్చిన విమానంలో ప్రయాణించినట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్‌ (Jammu & Kashmir)లోని పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడితో (Terror Attack) వీరికి సంబంధం (Connection) ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వారి పాస్‌పోర్టులు, కమ్యూనికేషన్ డివైసులు తదితర వివరాలు పరిశీలిస్తున్నారు.

ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న వారిని శ్రీలంక (Sri Lanka), భారత్ (India) నిఘా సంస్థలు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నాయని తెలుస్తోంది. పహల్గామ్ ఘటన వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను బయటకు తీసేందుకు ఈ అరెస్టులు కీలకంగా మారే అవకాశముందన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప‌హ‌ల్గామ్‌లో ప‌ర్యాట‌కుల‌పై కాల్పులు జ‌రిపిన ఉగ్ర‌వాదుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment