‘ప‌క్క‌లోకి వ‌స్తేనే ప‌ని ఇప్పిస్తా..’ – హిందూపురంలో టీడీపీ నేత దారుణం

ప‌క్క‌లోకి వ‌స్తేనే ప‌ని ఇప్పిస్తా.. - హిందూపురంలో టీడీపీ నేత దారుణం

శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) హిందూపురం (Hindupuram)లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అధికార టీడీపీ కార్య‌క‌ర్త (TDP Worker) మ‌హిళ‌ (Woman)తో మాట్లాడిన‌ ఆడియో కాల్‌ (Audio Call) రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ (Outsourcing) ఉద్యోగిగా (Employee) పనిచేస్తున్న ముస్లిం మహిళ రుక్సాన (Rukhsana)పై లైంగిక వేధింపులకు (Sexual Harassment) పాల్పడిన ఆడియో సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సీఎం బావ‌మ‌రిది, న‌టుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

వివ‌రాల్లోకి వెళితే.. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ కాంట్రాక్టర్‌ (Sanitation Contractor)గా పనిచేస్తున్న టీడీపీ నేత యుగంధర్ (Yugandhar) అలియాస్ (Alias) చింటు (Chintu), రుక్సానాను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. తిరిగి ఉద్యోగం పొందాలంటే, కోరికలు తీర్చాలని ఒత్తిడి చేసినట్లు ఆడియో సంభాషణల ద్వారా వెల్లడైంది. రుక్సానా తాను అలాంటి వ్యక్తి కాదని ప్రాధేయపడినప్పటికీ, టీడీపీ కార్య‌క‌ర్త‌, బాల‌కృష్ణ అనుచ‌రుడు ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు ఆడియో సంభాష‌ణ‌ల ద్వారా స్ప‌ష్టం అవుతోంది. ఈ విషయం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుల (పీఏ) వరకు చేరినట్లు సమాచారం.

వైరల్‌గా మారిన ఆడియోలో బాల‌కృష్ణ అనుచ‌రుడు, టీడీపీ కార్యకర్త క‌గ్గాల‌ప్ప‌ రుక్సానాతో మాట్లాడుతూ “ఉద్యోగం కావాలంటే సెక్స్ కమిట్‌మెంట్ ఇవ్వాలి” అని మాట్లాడినట్లు స్పష్టమవుతోంది. ఈ సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో వైసీపీ శ్రేణులు, మహిళా సంఘాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అధికారం ఉందని మహిళలపై ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటు. ఇలాంటి నీచమైన ప్రవర్తనను సహించేది లేదు” అని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన టీడీపీ నేతలపై కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment