మోదీ ఆతిథ్యం.. ప్రధానిని ఆ ప్రశ్న అడిగిన క్రికెటర్!

మోదీ ఆతిథ్యం.. ప్రధానిని ఆ ప్రశ్న అడిగిన క్రికెటర్!

మహిళల ప్రపంచ కప్ (Women’s World Cup) 2025 గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) అభినందనలు తెలిపారు. న్యూఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోడీ జట్టు సభ్యులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచ కప్ విజయం సాధించినందుకు జట్టును ప్రశంసించారు. ముఖ్యంగా, వరుసగా మూడు ఓటముల తర్వాత జట్టు అద్భుతమైన కం బ్యాక్ ఇవ్వడం, అలాగే సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌ను అధిగమించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

అయితే, ఈ భేటీలో క్రికెటర్ హర్లీన్ కౌర్ డియోల్ అడిగిన ఒక ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని మోడీని ఉద్దేశించి హర్లీన్.. “మీరు చాలా మెరుస్తారు సార్! ఇంత యవ్వనంగా కనిపించే మీ చర్మ సౌందర్యం వెనుక సీక్రెట్‌ ఏంటి?” అని అడిగింది. ఈ ప్రశ్నకు అక్కడున్న క్రికెటర్లంతా చిరునవ్వులు చిందించగా, ప్రధాని సైతం నవ్వుతూ సమాధానమిచ్చారు. చర్మ సంరక్షణ లేదా వస్త్రధారణపై తాను ఎప్పుడూ పెద్దగా శ్రద్ధ చూపలేదని చెప్పిన మోడీ, “ప్రత్యేకంగా ఏమీ చేయను. దాదాపు పాతికేళ్లుగా ప్రభుత్వ పాలనలో మునిగి ఉన్నా, ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలే శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతా” అని వివరించారు. ఈ చిరు సమాధానానికి జట్టు సభ్యులంతా చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment