ఆంధ్ర–కర్ణాటక (Andhra–Karnataka) సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. కడప (Kadapa) నుంచి బెంగళూరుకు (Bengaluru) బయలుదేరిన హరిత ట్రావెల్స్ బస్సు (Haritha Travels Bus) మంగళవారం వేకువజామున సుమారు 3 గంటల ప్రాంతంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, పది మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రమాదం బెంగళూరు సమీపంలోని శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ల కోట్ వద్ద జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన అనిత(Anitha) (58) దుర్మరణం పాలయ్యారు. గాయపడ్డ వారిలో కడప, రాయచోటి, బెంగళూరు ప్రాంతాలకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి నిజమైన కారణాలు తెలియాల్సి ఉంది.








