ఉప్పల్ (Uppal) లో జరిగిన BRSV రాష్ట్రస్థాయి సదస్సులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనతో పాటు కేంద్ర ప్రభుత్వం (Central Government)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు
హరీష్ రావు మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్(KCR) కనిపిస్తున్నాడు. ఎప్పుడూ జై మోడీ (Hail Modi), జై ఢిల్లీ (Hail Delhi) అంటున్నాడు… కానీ, ఒక్కసారి కూడా జై తెలంగాణ (Hail Telangana) అనడం లేదు. ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం” అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి (Kishan Reddy) లాంటి నాయకులు ప్రజల బాటలో లేరని, రాజీనామా చేయకుండా పక్కకి నడిచారని గుర్తుచేశారు. “రాజీనామా చేయమంటే జిరాక్స్ పేపర్ ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి” అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తిచూపే బదులు, దాన్ని మరుగున పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “తెలంగాణ ద్రోహుల జాబితాలో మొదటి పేరు చంద్రబాబు, రెండవ పేరు రేవంత్ రెడ్డిదే రాయాలి” అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం చంద్రబాబు (Chandrababu) డైరెక్షన్‌లో నడుస్తోందని ఆయన ఆరోపించారు. రేవంత్ పాలనలో తెలంగాణ తల్లి, కాకతీయ తోరణాన్ని, ఉద్యమ జ్ఞాపకాలను తొలగించడమే ముఖ్య లక్ష్యంగా మారిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. “అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయని వ్యక్తి సీఎం అయ్యాడు” అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి’
ఇంకా హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ గొప్ప విజనరీ నాయకుడని, ఆయన ఎప్పుడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదని అన్నారు. కానీ, రేవంత్ మాత్రం ప్రతి విషయంలో వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. “ఈ పాలనలో నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయి… నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి. చంద్రబాబుకి నీళ్లు, రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి నిధులు(Funds) వెళ్లేలా రేవంత్ పాలన సాగుతోంది” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గురుశిష్యులు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్న తీరును ప్రజలకు వివరిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.








