పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’కు చిక్కులు

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'కు చిక్కులు

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాకు సమస్యలు (Problems) ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం పూర్తిగా కల్పితమని, అయితే ప్రజావీరుడు పండగ సాయన్న జీవిత చరిత్రను ఆధారం చేసుకుని, చరిత్రలో ఎక్కడా లేని కల్పిత పాత్రలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని బీసీ సంఘం నాయకుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) విద్యార్థి డాక్టర్ శివ ముదిరాజ్ (Dr. Shiva Mudiraj) ఆగ్రహం వ్యక్తం చేశారు.

చరిత్రను వక్రీకరించే ఈ సినిమాను అడ్డుకుంటామని, త్వరలోనే ఈ చిత్రంపై హైకోర్టులో పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శివ ముదిరాజ్ మాట్లాడుతూ, పండగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీశారని తాము ఆరోపించగా, చిత్రబృందం దీనిని సమర్థించుకోవడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఇది పండగ సాయన్న సినిమా కాదని, 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర బుక్కరాయల కథ అని చిత్రయూనిట్ చెప్పిందని ఆయన తెలిపారు.

అయితే, సినిమా ట్రైలర్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని శివ ముదిరాజ్ అన్నారు. డబ్బుల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని, త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.

‘హరిహర వీరమల్లు’ సినిమా విషయానికి వస్తే, జ్యోతి కృష్ణ (Jyothi Krishna) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం (A. M. Ratnam) సమర్పణలో దయాకర్ రావు (Dayakar Rao) నిర్మించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 24న విడుదల కావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment